Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 తేదీలు వచ్చేశాయ్!

Flipkart Big Billion Days 2026 dates are out now
Advertisement
  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 తేదీలు ఖరారు
  • అక్టోబర్ 9 నుంచి అందరికీ అందుబాటులోకి సేల్
  • ప్లస్ సభ్యులకు అక్టోబర్ 8న ముందస్తు యాక్సెస్
  • ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్
Advertisement
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే తన వార్షిక 'బిగ్ బిలియన్ డేస్' సేల్ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ మెగా షాపింగ్ ఫెస్టివల్ ఈ ఏడాది అక్టోబర్ 9వ తేదీన ప్రారంభం కానుంది.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఒక రోజు ముందుగానే, అనగా అక్టోబర్ 8 నుంచే ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. సాధారణ వినియోగదారులు అక్టోబర్ 9 నుంచి తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ సేల్ ఎప్పుడు ముగుస్తుందనే విషయాన్ని సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు సుమారు రెండు వారాలు ఆలస్యంగా ప్రారంభం కానుండటం గమనార్హం. గతేడాది ఈ సేల్ సెప్టెంబర్ 23న మొదలైంది.

ప్రాథమికంగా కొన్ని ఆఫర్ల వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో జరిపే కొనుగోళ్లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ప్రత్యేకంగా 12 శాతం వరకు బ్యాంక్ ఆఫర్ ఉంటాయని సంస్థ తెలిపింది. వీటితో పాటు ప్రైస్ క్రాష్, బీబీడీ స్పెషల్, స్టీల్ డీల్, డబుల్ డిస్కౌంట్, రష్ అవర్స్ వంటి పలు విభాగాల్లో ప్రత్యేక రాయితీలు ఉంటాయని పేర్కొంది. సేల్ ప్రారంభ తేదీ దగ్గరపడే కొద్దీ పూర్తిస్థాయి ఆఫర్ల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Advertisement
Advertisement
Flipkart
Flipkart Big Billion Days 2026
BBD sale dates 2026
Flipkart offers and discounts
ICICI Axis bank card offers

More Telugu News